Samantha : సెర్బియా పబ్‌లో సమంత డ్యాన్సులు.. ఊ అంటావా.. ఊ ఊ అంటావా అంటూ రెచ్చిపోయిన సామ్..

ప్రస్తుతం సమంత సెర్బియాలో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో ఉంది. ఇక సెర్బియాలో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ అయిపోయిన తర్వాత గత రాత్రి సమంత సిటాడెల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది.

Samantha : సెర్బియా పబ్‌లో సమంత డ్యాన్సులు.. ఊ అంటావా.. ఊ ఊ అంటావా అంటూ రెచ్చిపోయిన సామ్..

Samantha dancing for oo antavaa oo oo antavaa song in Serbia pub

Updated On : June 11, 2023 / 6:59 AM IST

Samantha :  సామ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. వరుస షూట్స్ చేస్తుంది. ఓ పక్క విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఖుషి(Kushi) సినిమా షూట్ లో పాల్గొంటూనే ఈ షూట్ గ్యాప్ లో అటు బాలీవుడ్ లో వరుణ్ ధావన్(Varun Dhawan) తో చేస్తున్న సిటాడెల్(Citadel) సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. కొన్ని రోజుల క్రితం టర్కీలో ఖుషి సినిమా షూటింగ్ చేయగా అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది సామ్.

Anasuya : మరోసారి విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ఇకపై దీని గురించి మాట్లాడను.. నాకు మనశ్శాంతి కావాలి..

ప్రస్తుతం సమంత సెర్బియాలో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో ఉంది. ఇక సెర్బియాలో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ అయిపోయిన తర్వాత గత రాత్రి సమంత సిటాడెల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది. అక్కడ సమంత పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ప్లే చేయడంతో సమంత డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయింది. అక్కడ పబ్ కి వచ్చిన వాళ్లంతా కూడా ఆ పాటలకు ఫుల్ గా డ్యాన్స్ వేస్తున్నారు. సమంత బ్లాక్ డ్రెస్ లో ఆ పాటకు ఫుల్ జోష్ తో డ్యాన్స్ వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సమంత పబ్ లో రచ్చ చేస్తోందని, ఫుల్ ఎంజాయ్ చేస్తోందిగా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.