Samantha: ఫుల్ జోష్‌లో సామ్.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ!
చైతన్య సమంత విడాకుల వార్త చాలా రోజులు మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు. కానీ చై, సామ్ ఇద్దరూ తమ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Samantha
Samantha: చైతన్య సమంత విడాకుల వార్త చాలా రోజులు మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు. కానీ చై, సామ్ ఇద్దరూ తమ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సమంత స్పీడ్ పెంచేసింది. ఈ మధ్య తన లైఫ్ లో వచ్చిన డిస్టర్బెన్స్ నుంచి ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతోంది సమంత. మొన్నీ మధ్యనే ఫోటో షూట్ తో మళ్లీ పని స్టార్ట్ చేసిన సమంత. తన నెక్ట్స్ సినిమాల్ని స్టార్ట్ చేసింది. బ్యాక్ టూ బ్యాక్ 2 సినిమాల్ని అనౌన్స్ చేసి తనలో ఏ మాత్రం స్పీడ్ తగ్గలేదంటోంది సమంత.
Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?
సామ్ విడాకుల తర్వాత ఇటీవలే ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంలో కనిపించింది. సమంత ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది. తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా దసరా రోజున సమంత తన నెక్స్ట్ సినిమాలని అనౌన్స్ చేసింది. పర్సనల్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చిన సమంత.. ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేస్తోంది. నాగచైతన్య -సమంత విడిపోయాక ఈ మధ్యనే మళ్లీ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేసింది సమంత.
Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!
అందుకే పండగ రోజు ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాల్ని అనౌన్స్ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేశానని హింట్ ఇచ్చింది ఈ స్టార్ హీరోయిన్. 11 ఏళ్ల నుంచి నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ ఈ మధ్యనే బ్రేక్ తీసుకున్న సమంత నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతోంది. ఖైదీ, ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్ లో శాంతారుబన్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా సైన్ చేసింది సమంత. తమిళ్,తెలుగు బై లింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది.
Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో మరో మూవీ సైన్ చేసింది సమంత. డైరెక్టర్ డ్యుయో.. హరిశంకర్, హరీష్ నారాయణ్ డైరెక్షన్లో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూసర్ గా మరో మూవీకి ఓకే చెప్పింది సమంత. అంతేకాదు ఈ సినిమాని నెక్ట్స్ మన్త్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళుతున్నారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తోంది సమంత. తమ స్టార్ హీరోయిన్ మళ్లీ నార్మల్ గా రావడం చూసి సోషల్ మీడియాలో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ప్యాన్స్.