Samantha : కొత్త బిజినెస్ మొదలు పెట్టిన సమంత.. చెన్నై ఫ్రాంచైజీకి పార్ట్నర్‌గా..

సమంత తాజాగా స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది.

Samantha : కొత్త బిజినెస్ మొదలు పెట్టిన సమంత.. చెన్నై ఫ్రాంచైజీకి పార్ట్నర్‌గా..

Samantha join as a Partner in Sport Business Post goes Viral Details Here

Updated On : August 20, 2024 / 5:23 PM IST

Samantha : ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు, సిరీస్ లతో బిజీ అవుతుంది. అయితే ఈ గ్యాప్ లో సమంత ఎక్కువగా తన బిజినెస్ ల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సమంత ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్.. పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో కొత్త బిజినెస్ లో పెట్టుబడులు పెట్టింది.

Also Read : Maine Pyar Kiya : బాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్.. 35 ఏళ్ళ తర్వాత..

సమంత తాజాగా స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్ తో కలిసి సమంత పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంజైజ్ ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి సమంత ఈ విషయాన్ని తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.