Maine Pyar Kiya : బాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్.. 35 ఏళ్ళ తర్వాత..

బాలీవుడ్ లో ఒకప్పటి సూపర్ హిట్ సినిమా, క్లాసిక్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.

Maine Pyar Kiya : బాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్.. 35 ఏళ్ళ తర్వాత..

Bollywood Super Hit Classic Movie Salman Khan Bhagyashree Maine Pyar Kiya Re Releasing Details Here

Updated On : August 20, 2024 / 4:57 PM IST

Maine Pyar Kiya : ఇటీవల తెలుగు, తమిళ్ లో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆనవాయితీ బాలీవుడ్ కి కూడా పాకి కొన్ని సినిమాలని రీ రిలీజ్ చేసారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఒకప్పటి సూపర్ హిట్ సినిమా, క్లాసిక్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.

సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో 1989 లో వచ్చిన సినిమా ‘మైనే ప్యార్ కియా’. 35 ఏళ్ళ క్రితం 1989 డిసెంబర్ 29న రిలీజయిన మైనే ప్యార్ కియా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఆ రోజుల్లోనే ఒక కోటి రూపాయలు పెట్టి ఈ సినిమాని రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తే ఏకంగా 28 కోట్లు కలెక్ట్ చేసింది. 1989లో 28 కోట్లు కలెక్ట్ చేయడమంటే మాములు విషయం కాదు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ మించి పెద్ద హిట్ ఈ సినిమా. ఇక ఈ సినిమా పాటలు అయితే ఇప్పటికి కూడా బోర్ కొట్టవు.

Also Read : Actress Hema : దయచేసి నాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించండి.. బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై హేమ వీడియో..

మైనే ప్యార్ కియా సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోని అన్ని ప్రదేశాల్లో కూడా బాగా ఆడింది. తెలుగులో ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో రిలీజయి ఇక్కడ కూడా ఏకంగా 200 రోజులకు పైగా ఆడి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. 35 ఏళ్ళ తర్వాత మైనే ప్యార్ కియా సినిమాని ఆగస్టు 23న రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఈ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ రాజశ్రీ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. ఇండియా అంతటా ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా అభిమానులు కూడా మరోసారి థియేటర్స్ లో ఈ సినిమా చూడటానికి రెడీ అయిపోయారు.

View this post on Instagram

A post shared by Rajshri (@rajshrifilms)