Actress Hema : దయచేసి నాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించండి.. బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై హేమ వీడియో..

తాజాగా హేమ మరోసారి బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

Actress Hema : దయచేసి నాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించండి.. బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై హేమ వీడియో..

Actress Hema Shares a Video regarding Benguluru Rave Party Case Request Their Appointment

Updated On : August 20, 2024 / 4:51 PM IST

Actress Hema : ఇటీవల సీనియర్ నటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలతో అరెస్ట్ అయి అనంతరం బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హేమ బాగా వైరల్ అయింది. తను డ్రగ్స్ తీసుకోలేదని మొదట్నుంచి చెప్తూ వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెని సస్పెండ్ చేయడంతో మంచు విష్ణుని కలిసి మరీ మాట్లాడింది.

Also Read : Dulquer Salmaan : దీపావళి బరిలో దుల్కర్ సల్మాన్.. తెలుగులో హ్యాట్రిక్ కొడతాడా?

తాజాగా హేమ మరోసారి బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. హేమ మాట్లాడుతూ.. నేను చేయించుకున్న టెస్టుల్లో అన్ని నెగిటివ్ వచ్చాయి. బహిరంగంగా కూడా ఎలాంటి టెస్ట్ లు చేయించుకోవడానికి అయినా నేను రెడీ. నా వాయిస్ ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్లాలని ట్రై చేస్తున్నాను. వారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. దయచేసి వారి అపాయింట్మెంట్ వచ్చేలా నాకు సహకరించండి అంటూ వేడుకుంది.

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

తాను టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిన రిపోర్టులను వీడియోలో చూపించింది. దీంతో హేమ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.