చెవి పోగులతో చూపులన్నీ తనవైపు తిప్పుకుంది..

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 07:47 PM IST
చెవి పోగులతో చూపులన్నీ తనవైపు తిప్పుకుంది..

Updated On : August 19, 2020 / 9:49 AM IST

లాక్‌డౌన్ టైం ఎవరికెలా ఉన్నా సెలబ్రిటీలకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. షూటింగులతో హడావిడిగా ఉండే నటీనటులందరూ అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని నచ్చిన పనులు చేస్తూ, ఆసక్తిఉన్న విషయాలు నేర్చుకుంటూ (వంట, సంగీతం, డ్యాన్స్) ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేస్తూ, కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఎవరికివారు ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియా ద్వారా తమ అప్‌డేట్స్ తెలియజేస్తున్నారు.



అక్కినేని సమంత ఈ లాక్‌డౌన్ టైంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ ఆ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రానా పెళ్లిలో సామ్ ధరించిన డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది కూడా.



తాజాగా తన కొత్త ఇయర్ రింగ్స్ పిక్ షేర్ చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘New piercings’ అంటూ చెవి పోగులు చూపిస్తూ అందరి చూపులూ తనవైపు తిప్పేసుకుంది సామ్. ఈ ఫొటోకు దాదాపు 9 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.

https://www.instagram.com/p/CEBT7t7BmkU/?utm_source=ig_web_copy_link