Samantha : అమెరికాలో బంధువుల పెళ్ళిలో సమంత.. ఫ్యామిలీ అంటూ పోస్ట్.. ఫొటోలు వైరల్..
తాజాగా ఓ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది సమంత.

Samantha Shares Her Relatives Marriage Photos
Samantha : సమంత తన ఆరోగ్యం కుదుటపరుచుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు, సిరీస్ లతో బిజీ అవుతుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది సమంత.
తాజాగా ఓ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది సమంత.
అమెరికాలో తన ఫ్యామిలీకి చెందిన డేవిడ్, నికోల్ అనే జంట పెళ్ళికి సమంత హాజరైంది. సమంత ఫ్యామిలీ, సన్నిహితులు ఈ పెళ్ళికి హాజరయ్యారు.
అమెరికాలోని లేక్ జెనీవా నగరంలో క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ పెళ్లి జరిగింది. సమంత పెళ్ళిలో సందడి చేసింది.
పెళ్ళిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సమంత సందడి చేసిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలు చూసి సమంత ఫ్యాన్స్ సమంత అందంగా ఉందంటూ, ఆ డ్రెస్ లో అదరగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.