Subham : చాన్నాళ్లకు మీడియా ముందుకు రాబోతున్న సమంత.. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎప్పుడు?
హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం శుభం.

Samantha Subham movie pre release event on may 4th
హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం శుభం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొణతం, షాలిని కొండేపూడి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మే 4న వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.