Ram Charan : చరణ్ విషయంలో 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను.. డైరెక్టర్ సంపత్ నంది పోస్ట్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' చిత్రంతో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నా సంగతి తెలిసిందే. అయితే చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ నేను 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను అంటున్నాడు డైరెక్టర్ సంపత్ నంది.

Ram Charan : చరణ్ విషయంలో 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను.. డైరెక్టర్ సంపత్ నంది పోస్ట్!

global star ram charan

Updated On : February 27, 2023 / 11:37 AM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘RRR’ చిత్రంతో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్ చరణ్.. అక్కడ అరుదైన ఘనతలు దక్కించుకుంటూ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకి మొదటి ఇండియన్ గెస్ట్ గా, HCA అవార్డ్స్ కి మొదటి ఇండియన్ ప్రజెంటర్ గా హాజరయ్యి హిస్టరీ క్రియేట్ చేయడంతో.. ఆనంద్ మహేంద్ర వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్త సైతం రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అంటూ ప్రశంసించాడు.

Ram Charan-Venkatesh : అమెరికా పెళ్ళిలో చరణ్-వెంకీ మామ సందడి.. వెంకీ మామ చరణ్ గురించి ఏమన్నాడో తెలుసా?

అయితే చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ నేను 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను అంటున్నాడు డైరెక్టర్ సంపత్ నంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చరణ్ రచ్చ సినిమా చేశాడు. ఆ సినిమా టైటిల్ సాంగ్ లో ‘హిస్ గాన్ బి ఎ గ్లోబల్ స్టార్’ అంటూ లిరిక్స్ ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంపత్ నంది పోస్ట్ వేశాడు. అలాగే యాదృచ్ఛికంగా నాటు నాటు సాంగ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్, డాన్స్ కోరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్.. రచ్చ టైటిల్ సాంగ్ కూడా పని చేశారు అంటూ తెలియజేశాడు. ఇక ఈ పోస్ట్ కి చంద్రబోస్ స్పందిస్తూ.. ‘అక్షరాలా నిజము తమ్ముడూ. హృదయంలోంచి వచ్చిన మాటకు వున్న శక్తి అది’ అంటూ బదులిచ్చాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుగుతున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉగాది పండుగ నాడు ఉంటుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.