Sampoornesh Babu : అందుకే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసాను.. 8 ఏళ్ళ తర్వాత మాట్లాడిన సంపూర్ణేష్ బాబు.. ఎన్టీఆర్ సపోర్ట్ ఇచ్చినా..
సంపూర్ణేష్ బాబు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి వెళ్ళాడు.

Sampoornesh Babu Comments on his walkout from Bigg Boss after 8 Years
Sampoornesh Babu : హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారి స్టార్ గా మారిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో సోదరా అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా హృదయకాలేయం సినిమా రిలీజయి 11 ఏళ్ళు అయిన సందర్భంగా సంపూర్ణేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో తన సినిమాల గురించి, బిగ్ బాస్ గురించి, తన లైఫ్ గురించి మాట్లాడాడు. సంపూర్ణేష్ బాబు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి వెళ్ళాడు. అయితే 9 రోజులకే నేను ఉండలేను అంటూ బయటకు వచ్చేసాడు. ఆ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించారు. తాజాగా దీనిపై మరోసారి స్పందించాడు.
Also Read : Saaree : ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ.. ఆరాధ్య అందాలతో సైకో థ్రిల్లర్.. మంచి కాన్సెప్ట్ కానీ..
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. అదే మొదటిసారి బిగ్ బాస్. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. అందరూ మంచి ఛాన్స్ వచ్చింది వెళ్ళమని ప్రోత్సహించడంతో వెళ్ళాను. కానీ అక్కడ జీవితం రిచ్ గా, డిఫరెంట్ గా అనిపించింది. అలా ఒక ఇంట్లో బంధించుకొని, అలా జీవించడం నా వల్ల కాలేదు. అందుకే షోలో ఏడ్చాను. ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇచ్చినా అక్కడి నుంచి మధ్యలోనే వచ్చేసాను. అలా బిగ్ బాస్ నుంచి మధ్యలో వచ్చేసినందుకు నా దురదృష్టంగా భావించాను. షో నుంచి బయటకు వచ్చాక చాలా మంది ఎందుకు వచ్చేసావు అని నాపై సీరియస్ అయ్యారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను.