Sanjay Dutt : అమ్మాయిల కోసమే డ్రగ్స్ తీసుకున్నా
సంజయ్ డ్రగ్స్ గురించి మాట్లాడుతూ.. ''అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం వేసేది. అంత తొందరగా అమ్మాయిలతో మాట్లాడేవాడిని కాదు. ఎలాగైనా అమ్మాయిలతో మాట్లాడాలని..........

Sanjay
Sanjay Dutt : తాజాగా రిలీజ్ అయిన ‘కేజీయఫ్ 2’లో అధీరాగా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ మెప్పించారు. ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. విలన్ గా హీరోకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ సినిమాతో మరోసారి సంజయ్ భారీ సక్సెస్ ని అందుకున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించడంతో పలు బాలీవుడ్ మీడియా సంస్థలు సంజయ్ దత్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంజయ్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.
గతంలో సంజయ్ దత్ డ్రగ్స్ తీసుకోవడం, జైలుకు వెళ్లి రావడం, కొన్నాళ్ళు సినీ పరిశ్రమకి దూరమవ్వడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ అందరికి తెలిసినవే. సంజయ్ బయోపిక్ లో కూడా ఇవన్నీ చూపించారు. తాజాగా సంజయ్ వీటిపై మాట్లాడారు. ఇంటర్వ్యూలో సంజయ్ డ్రగ్స్ గురించి మాట్లాడుతూ.. ”అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం వేసేది. అంత తొందరగా అమ్మాయిలతో మాట్లాడేవాడిని కాదు. ఎలాగైనా అమ్మాయిలతో మాట్లాడాలని ట్రై చేసేవాడ్ని. డ్రగ్స్ వాడితే కొంచెం ధైర్యం వస్తుందని, కూల్ గా కనిపిస్తానని భావించి అమ్మాయిలతో మాట్లాడటం కోసమే డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాను”
Sanjay Dutt : అక్కడ హీరోయిజం ఉండాల్సిందే.. సౌత్ సినిమాలపై సంజయ్ దత్ వ్యాఖ్యలు..
”కానీ అలా మొదలైన డ్రగ్స్ తర్వాత నా జీవితాన్ని మార్చేశాయి. డ్రగ్స్ కి నేను బానిసనయ్యాను. డ్రగ్స్ నుంచి బయటకి రావడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నా జీవితంలో పదేళ్లు రూమ్ లోనో లేదా బాత్రూమ్ లోనో గడిపాను. షూటింగ్స్ పై కూడా ఆసక్తి పోయింది. ఒంటరిగా ఉండేవాడిని. డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌లో కూడా చాలా కాలం ఉన్నాను. తిరిగొచ్చాక అందరూ నన్ను డ్రగ్ అడిక్ట్ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవాలని డిసైడ్ అయి మళ్ళీ నటన, బాడీ మేకింగ్ పై దృష్టి పెట్టాను” అని తెలిపారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయి కష్టపడి బయటకి వచ్చి మళ్ళీ పాత మనిషిలా సక్సెస్ సాధించిన సంజయ్ ని ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా అభినందిస్తున్నారు. ఇక అధీరాగా కేజిఎఫ్ లో తన నటనతో అందర్నీ మరోసారి మెప్పించాడు.