సంక్రాంతికి బరిలో ఉన్న బన్నీ ఇచ్చిన బిగ్ ట్విస్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని పండుగ సీజన్లకు ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో సక్రాంతి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీనే ఉండనుంది. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో వస్తుండగా, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ తో రానున్నాడు. ఒకరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదలకు పోటీ పడుతుండటంతో వాతావరణం ఆసక్తిగా మారింది.
టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో నిలిచారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్లు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.
సరిలేరు నీకెవ్వరు:
మహేశ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ సంక్రాంతికి (జనవరి 10, 2020)న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేశారు. ఇది కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలన్న కసితో ఉన్న సూపర్ స్టార్.. అందుకోసం ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.
అల.. వైకుంఠపురములో:
అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ వాస్తవానికి జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజాగా దానికి జనవరి 10 మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా రిలీజ్ డేట్ ను రెండు రోజులు ముందుకు జరపడానికి కారణం ఓపెనింగ్స్ అనే టాక్ వినిపిస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.