Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..

2024 సంక్రాంతికి బిగ్ ఫిలిం ఫెస్టివల్ ఉండబోతుంది. అదికూడా స్టార్ హీరోలు, క్రేజీ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ జోనర్స్ తో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..

Sankranti 2024 releases Kalki 2898 AD Hanuman Guntur Kaaram Eagle Naa Saami Ranga

Sankranti 2024 : ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమాల జాతర ఉండబోతుంది. స్టార్ హీరోలు, క్రేజీ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ జోనర్స్ తో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటిలో ముందుగా మాట్లాడుకోవాల్సిన సినిమా ప్రభాస్ (Prabhas) చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ కల్కి (Kalki 2898 AD). ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వొచ్చని టాక్ వినిపిస్తుంది.

Nagarjuna : ధనుష్ – శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గెస్ట్ రోల్ ఫిక్స్.. పవర్ హౌస్ అంటూ అనౌన్స్..

ఇక ఈ మూవీతో పాటు మరో సూపర్ హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీ పడబోతోంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హనుమాన్’ (Hanuman). ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడంతో జనవరి 12కి వాయిదా పడింది. మరి ఆ డేట్ కి అయినా వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఇక మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తున్నప్పటికీ.. జనవరి 12 కచ్చితంగా వస్తామని చెబుతున్నారు.

Koratala Siva : అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ప్లాన్ చేస్తున్నాడా?

రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’ (Eagle) డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతికే వస్తామంటూ ప్రకటించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాని నిర్మాత దిల్ రాజు కచ్చితంగా పండగ బరిలో నిలబెడతాను అని చెబుతున్నాడు. అయితే డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం వచ్చి చేరింది. అయితే ఇది కూడా కచ్చితమైన తేదీ ప్రకటించలేదు. పండక్కి వస్తామంటూ వీరంతా ప్రకటించినప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితమైన కన్ఫర్మేషన్ లేదు. మరి బరిలో చివరికి ఎవరు నిలుస్తారో చూడాలి.