Sankranti 2024 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన రవితేజ.. ఈసారి సంక్రాంతికి అరడజనకు పైగా..

ఈసారి సంక్రాంతి బరిలో అరడజనకు పైగా సినిమా రిలీజ్ లు కనిపిస్తున్నాయి. ఇక ఈ రేసులో రవితేజ తన బెర్త్ ని కన్ఫార్మ్..

Sankranti 2024 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన రవితేజ.. ఈసారి సంక్రాంతికి అరడజనకు పైగా..

Sankranti 2024 Tollywood and dubbing movie releases updates

Updated On : September 27, 2023 / 6:11 PM IST

Sankranti 2024 : రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ (Eagle) సినిమాల్లో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావుని దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక ఈగల్ మూవీని సంక్రాంతి కానుకగా తీసుకు వస్తామంటూ ప్రకటించాడు. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సంక్రాంతి రేసులోకి అనేక సినిమాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో కొన్ని చిత్రాలు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది. అయితే సంక్రాంతి భారీ నుంచి వెనక్కి వచ్చేది లేదని రవితేజ కన్ఫార్మ్ చేసేశాడు.

Parineeti Chopra : రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహ వీడియో.. కొత్తజంట డ్యాన్స్ వైరల్..!

తాజాగా ఈగల్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. “మొండోడు పండగ తీసుకుని జనవరి 13న వస్తున్నాడు” అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో సంక్రాంతి రేసులో రవితేజ బెర్త్ కన్ఫార్మ్ అయ్యిపోయింది. అలాగే పండగ బరిలో ఆల్రెడీ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న సినిమాలు సంగతికి వస్తే.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’ జనవరి 12న రిలీజ్ కాబోతున్నాయి.

ఇక నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘VD13’, తమిళ్ హీరో శివకార్తికేయన్ ‘అయలాన్’ సినిమాలను పండక్కి తీసుకు వస్తామంటూ ప్రకటించారు గాని ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. ఇక ఈ ఏడాది క్రిస్టమస్ కి రావాల్సిన వెంకటేష్ ‘సైంధవ్’ని పోస్టుపోన్ చేసి సంక్రాంతికి తీసుకు రాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీటన్నిటికంటే ముందుగా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ పండగా బరిలో నిలిచింది.

Jailer 2: ‘జైలర్‌-2’ కోసం అడ్వాన్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు నెల్సన్‌ దిలీప్ కుమార్..! ఎంతో తెలుసా..?

అయితే కల్కి మూవీ ఆల్మోస్ట్ ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క ‘సలార్’ కూడా డిసెంబర్ 25న రాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో సలార్ అండ్ కల్కి రిలీజ్ మధ్య కేవలం రెండు వారలు గ్యాప్ మాత్రం ఉంటుంది. కాబట్టి కల్కి వర్క్స్ మొత్తం పూర్తి అయ్యినా.. జనవరిలో తీసుకు రావడం కష్టమే అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే.. సంక్రాంతి బరిలో అరడజనకు పైగా సినిమా రిలీజ్ లు కనిపిస్తున్నాయి.