Saranga Dariya Song : 100 మిలియన్ల సాయి పల్లవి ‘సారంగదరియా’..

‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Saranga Dariya Song : 100 మిలియన్ల సాయి పల్లవి ‘సారంగదరియా’..

Saranga Dariya Song

Updated On : May 25, 2021 / 12:07 PM IST

Saranga Dariya​​ : ‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Read:‘సారంగదరియా’.. సాయి పల్లవికి మరో 100 మిలియన్ల సాంగ్..

తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేసిన తక్కు వ సమయంలోనే 1 మిలియన్‌కి పైగా లైక్స్ సాధించి పాత రికార్డులను బీట్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.. తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ టైం లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన పాటగా ‘సారంగ దరియా’ కొత్త రికార్డ్ సెట్ చేసింది.

Read:Saranga Dariya​​ : సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Love Story