Sarkaru Vaari Paata : సమ్మర్‌లోనే ‘సర్కారు వారి పాట’..

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. సమ్మర్‌లోనే ‘సర్కారు వారి పాట’ వస్తుందంటూ తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు..

Sarkaru Vaari Paata : సమ్మర్‌లోనే ‘సర్కారు వారి పాట’..

Sarkaru Vaari Paata

Updated On : January 31, 2022 / 8:13 PM IST

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. గతకొద్ది రోజులుగా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కి తెరదించుతూ కొత్త రిలీజ్ డేట్ కన్ఫమ్ చేశారు. ఇంతకుముందు నిర్మాతలు జనవరి 13, 2022, ఏప్రిల్ 1, 2022 రెండు రిలీజ్ డేట్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహేష్, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
సంక్రాంతికి రావల్సిన సినిమా పోస్ట్ పోన్ అయి, ఏప్రిల్ 1కి వస్తుందని చెప్పారు కానీ మళ్లీ వాయిదా వేశారు. ఎట్టకేలకు మే 12న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని భారీగా విడుదల చెయ్యనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్..

ఇంకా నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫిబ్రవరి చివరి వారం నుండి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. వాలంటైన్స్ డే కానుకగా ‘సర్కారు వారి పాట’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మహేష్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

F3 Movie : హాట్ సమ్మర్‌లో కూల్ ఫన్.. ‘ఎఫ్ 3’ వచ్చేస్తోంది..