Satish Kaushik : సతీష్ కౌశిక్ అంత్యక్రియలు.. తరలివచ్చిన బాలీవుడ్.. అన్ని దగ్గరుండి చూసుకున్న అనుపమ్ ఖేర్..

అనుపమ్ ఖేర్ సతీష్ భౌతికకాయం వద్దే కూర్చొని విలపించాడు. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్ని జరిపించాడు. సతీష్ కౌశిక్ అంతిమ యాత్రలోనూ అతని పక్కనే కూర్చున్నాడు. అంత్యక్రియలు.................

Satish Kaushik : సతీష్ కౌశిక్ అంత్యక్రియలు.. తరలివచ్చిన బాలీవుడ్.. అన్ని దగ్గరుండి చూసుకున్న అనుపమ్ ఖేర్..

satish kaushik funeral bollywood stars pays tributes anupam kher done all arrangements

Updated On : March 10, 2023 / 8:37 AM IST

Satish Kaushik :  ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మార్చ్ 9 గురువారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. సతీష్ కౌశిక్ దాదాపు 100 కి పైగా హిందీ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 20 సినిమాలను దర్శకుడిగా తెరకెక్కించారు. సతీష్ కౌశిక్ హఠాన్మరణంతో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ కి 45 ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో మా 45 ఏళ్ళ స్నేహం అర్దాంతరంగా ముగిసిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణబీర్ కపూర్, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్.. ఇలా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

బాలీవుడ్ కి చెందిన స్టార్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణబీర్ కపూర్, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, షెహనాజ్ గిల్, నీనా గుప్తా, ఇషాన్ ఖట్టర్, ఫర్హాన్ అక్తర్, జావేద్ అక్తర్, సంజయ్ కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, అభిషేక్ బచ్చన్, జానీలీవర్, రాకేష్ రోషన్, బోనీ కపూర్… ఇలా అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటివద్దకు వచ్చి సతీష్ కౌశిక్ కు నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం సతీష్ కౌశిక్ అంత్యక్రియలు నిర్వహించారు.

Alia-Ranbir : ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయిన అలియా, రణబీర్.. కోర్టుకు వెళతాం అంటూ హెచ్చరిక..

ఇక అనుపమ్ ఖేర్ సతీష్ భౌతికకాయం వద్దే కూర్చొని విలపించాడు. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్ని జరిపించాడు. సతీష్ కౌశిక్ అంతిమ యాత్రలోనూ అతని పక్కనే కూర్చున్నాడు. అంత్యక్రియలు జరిగేంతవరకు అనుపమ్ ఖేర్ అక్కడే ఉన్నారు. బాలీవుడ్ ఓ మంచి నటుడు, దర్శకుడిని కోల్పోయిందని అంతా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు, అభిమానులు ఆయన చేసిన పాత్రలని గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.