Screen Writers Association : రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు మద్దతు తెలిపిన ఇండియన్ రైటర్స్.. షాక్ లో హాలీవుడ్..

రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు కొన్ని హాలీవుడ్ యూనియన్లు మద్దతు ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు ఇండియాకు చెందిన స్క్రీన్ రైటర్స్ అస్సోసియషన్(SWA) మద్దతు ప్రకటించింది.

Screen Writers Association : రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు మద్దతు తెలిపిన ఇండియన్ రైటర్స్.. షాక్ లో హాలీవుడ్..

Screen Writers Association supports to Writers guild of America Strike

Updated On : May 5, 2023 / 9:00 AM IST

Screen Writers Association :  హాలీవుడ్ టీవీ(TV), ఓటీటీ(OTT), సినిమాలకు కంటెంట్ అందించే రైటర్స్ కు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అసోసియేషన్ ఉంది. చాలా మంది రైటర్స్ ఈ అసోసియేషన్ లో మెంబర్స్ గా ఉన్నారు. అయితే తాజాగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్నా తమకు మాత్రం కనీస వేతనం ఇవ్వట్లేదంటూ ఆరోపిస్తూ కొన్ని డిమాండ్స్ తో సమ్మెకు దిగారు. గత మూడు రోజులుగా ఈ సమ్మె సాగుతోంది.

సమ్మెకు వెళ్లేముందు నిర్మాణ సంస్థల యూనియన్ అయిన AMPTP (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీంతో గత మూడు రోజుల నుంచి హాలీవుడ్ లో ఏ ఒక్క రైటర్ కూడా పని చెయ్యట్లేదు, కంటెంట్ రాయట్లేదు. వీరి సమ్మెకు హాలీవుడ్ లోని ప్రముఖులు, మరికొన్ని యూనియన్లు మద్దతు పలికాయి. ఈ సమ్మె వల్ల హాలీవుడ్ టీవీ షోలు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, సోనీ, యాపిల్.. లాంటి ఓటీటీ లలో వారం వారం వస్తున్న సిరీస్ లపై ఎఫెక్ట్ పడనుంది.

ఇప్పటికే ఈ సంస్థలు తమకు నష్టం రాకూడదని నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు కొన్ని హాలీవుడ్ యూనియన్లు మద్దతు ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు ఇండియాకు చెందిన స్క్రీన్ రైటర్స్ అస్సోసియషన్(SWA) మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి హాలీవుడ్ ప్రాజెక్టులకు పని చేసే ఎవ్వరూ కూడా ఈ సమ్మె అయ్యేంతవరకు పనిచేయమని స్క్రీన్ రైటర్స్ అస్సోసియషన్ తెలిపింది. దీంతో హాలీవుడ్ కి మరో పెద్ద షాక్ తగిలింది. అమెరికా కంటెంట్ కి అమెరికా తర్వాత పెద్ద మార్కెట్ ఇండియానే. ఇప్పుడు ఇండియన్ రైటర్స్ కూడా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు మద్దతు ప్రకటించడంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు, పలు ఓటీటీలు షాక్ లో ఉన్నాయి.

Writers Guild of America : స్ట్రైక్ చేస్తున్న రైటర్స్.. ఏం చేయాలో తెలియని స్థితిలో హాలీవుడ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్..

ఇండియన్ రైటర్స్ మాత్రమే కాక రైటర్స్ గిల్డ్ ఆఫ్ బ్రిటన్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా, రైటర్స్ గిల్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా కూడా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా చేస్తున్న సమ్మెకు మద్దతు పలికాయి. ఈ సమ్మెపై నిర్మాణ సంస్థలు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాతో చర్చలు జరుపుతున్నా అవి సఫలం అవ్వట్లేదు. మరి ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి. ఒక రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఈ సమ్మె జరిగితే కచ్చితంగా పలు ఓటీటీ, టీవీ సంస్థలు భారీ నష్టాలను చూడటం ఖాయం.