Bigg Boss Nonstop: ఎలిమినేషన్ నామినేషన్.. ఈ వారం లిస్టులో 12 మంది!

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మొదలై తొలి వారం పూర్తయింది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా..

Bigg Boss Nonstop: ఎలిమినేషన్ నామినేషన్.. ఈ వారం లిస్టులో 12 మంది!

Bigg Boss Nonstop

Updated On : March 8, 2022 / 7:29 AM IST

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మొదలై తొలి వారం పూర్తయింది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా సోమవారం రెండో వారం నామినేషన్స్ కూడా పూర్తి చేశాడు బిగ్ బాస్. వారియర్స్ టీమ్ సభ్యులు.. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులను, ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ టీమ్ సభ్యులను నామినేట్ చేయాలి. సహజంగా నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నామినేషన్స్ లో అదే కనిపించింది.

BiggBoss NonStop : చాలెంజర్స్‌ వర్సెస్ వారియర్స్.. బిగ్‌బాస్‌‌లో మొదటి రోజే గొడవలు

కంటెస్టెంట్ల ఫోటోలతో కూడిన బాక్సులలో నచ్చని వాళ్ళ ఫోటో మీద డ్రాగన్ తో గుచ్చి కారణాలను చెప్పాలని ఇచ్చిన టాస్కులలో కంటెస్టెంట్లు వాళ్ళకి నచ్చని వాళ్ళని నామినేట్ చేశారు. చివరకి మొత్తంగా ఈ వారం సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టాలు హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు.

Bigg Boss Non Stop: మొదలైన ఎలిమినేషన్స్.. తొలి వారం ముమైత్ ఔట్!

గతం వారమే మిత్ర ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా ముమైత్ ఎలిమినేట్ అయింది. ఈ వారం కూడా మిత్ర నామినేషన్స్ లో మిత్ర ఉండడంతో ఆమెనే ఎలిమినేట్ చేయొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ అంటే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు కదా.. మరి చూడాలి రెండో వారం హౌస్ నుంచి వీరిలో ఎవరు బయటికొస్తారనేది.