BiggBoss NonStop : చాలెంజర్స్‌ వర్సెస్ వారియర్స్.. బిగ్‌బాస్‌‌లో మొదటి రోజే గొడవలు

ఈ ప్రోమోలో.. ''ప్రతిరోజు చాలెంజర్స్‌ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని, చాలెంజర్స్‌ భోజనం చేసిన తర్వాతే వారియర్స్‌ ఒకేచోట కలిసి...

BiggBoss NonStop : చాలెంజర్స్‌ వర్సెస్ వారియర్స్.. బిగ్‌బాస్‌‌లో మొదటి రోజే గొడవలు

Biggboss Non Stop

BiggBoss NonStop :  డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నిన్న సాయంత్రం మొదలైంది. ఈ సారి టీవిలో కాకుండా ఓటీటీలో 24/7
టెలికాస్ట్ మొదలైంది. టీవీలో టెలికాస్ట్ కంటే ఓటీటీలో తక్కువ వ్యూయర్ షిప్ వస్తున్నట్టు సమాచారం. అయినా బిగ్‌బాస్‌ అభిమానులు ఈ షోని చూస్తున్నారు. ఈ సారి పాత కంటెస్టెంట్స్ కూడా చాలా మంది బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో పార్టిసిపేట్ చేస్తున్నారు.

 

ఈ సారి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో పాత కంటెస్టెంట్స్ వర్సెస్ కొత్త కంటెస్టెంట్స్ అన్నట్టు సాగబోతోంది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. తాజాగా కొత్త ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని లిస్ట్ ని చదివించారు. ఇందులో చాలెంజర్స్ పై చేయిగా వారియర్స్ కింద ఉండేలా చెప్పారు.

Sharwanand : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ రిలీజ్..

ఈ ప్రోమోలో.. ”ప్రతిరోజు చాలెంజర్స్‌ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని, చాలెంజర్స్‌ భోజనం చేసిన తర్వాతే వారియర్స్‌ ఒకేచోట కలిసి ఒకేసారి తినాలని నిబంధన పెట్టడం, వారియర్స్‌ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్‌ ఆధ్వర్యంలో నిర్ణయిస్తారని తెలిపారు. దీంతో ఎవరు ఏ పని చేయాలి అనే అంశంపై వారియర్స్ తమ గురించి తాము చెప్పుకుంటుంటే ఈ క్రమంలో శ్రీరాపాకకు, అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంటర్వ్యూలో ఓవరాక్టింగ్‌ వద్దని శ్రీరాపాక అనడంతో అరియానా స్టేట్‌మెంట్స్‌ ఇవ్వద్దు, నా స్టైల్‌ ఇలానే ఉంటుంది. నచ్చకపోతే జాబ్ ఇవ్వొద్దు అని కౌంటరిచ్చింది.” దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Samantha : సమంత 12 ఏళ్ళ ప్రయాణం సెలెబ్రేషన్స్

ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా, 24 గంటలు ఏం చూపిస్తున్నారో తెలుసుకోవాలన్నా, నామినేషన్ల పర్వం చూడాలన్నా డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌లో చూడాల్సిందే.