రవితేజ న్యూ అవతార్ చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా న్యూ లుక్.. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా న్యూ లుక్.. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్..
మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో డిస్కోరాజా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు.
నేల టికెట్ తర్వాత రవితేజతో ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది. ప్రస్తుతం డిస్కోరాజా ఢిల్లీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు బ్రేక్ టైమ్‌లో రవితేజ, స్టిల్ ఫోటోగ్రాఫర్ మాగంటి సాయి కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవితేజ కంప్లీట్ న్యూ లుక్‌లో గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. కొడుకు క్యారెక్టర్ కోసం రవితేజ ఇలా న్యూ అవతార్‌లో కనిపించనున్నాడు అని అనుకుంటుండగా.. అబ్బే, అదేం లేదు.. ఇది ఒరిజినల్ పిక్ కాదు.. ఫేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసిన పిక్ అంటూ సోషల్ మీడియాలో మరో ఫోటో ప్రత్యక్షమైంది.. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆడియన్స్‌కు అసలు సంగతి..
Read Also : వెంకీమామతో కోడలు పిల్ల..
ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా, తర్వాతి షెడ్యూల్ స్విట్జర్లాండ్‌లో ప్లాన్ చేశారు. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నారు. 2020 సంక్రాంతికి డిస్కోరాజాని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.