Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నారా లోకేశ్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం

Chandra mohan

Updated On : November 11, 2023 / 12:06 PM IST

Chandra Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం 9.45 గంటలకు ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Also Read : Chandra Mohan : ఒకప్పటి హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు చంద్రమోహన్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు. చంద్రమోహన్ మృతి బాధాక‌రం. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్ర‌మోహ‌న్ మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అన్నారు. వారి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ‌స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు.

 

 

అచ్చెన్నాయుడు సంతాపం..

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతిపట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. సినీరంగంలో తన నటనతో తెలుగువారిని అలరించారని, తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని పేర్కొన్నారు. చంద్రమోహన్ మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరనిలోటు అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంతాపం ..
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. 932కు పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన నటుడు చంద్రమోహన్ అని, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా జనరంజక పాత్రలు పోషించారని అన్నారు. ఫిలింఫేర్, నంది అవార్డులు చంద్రమోహన్ నటనకు మచ్చుతునకలని పేర్కొంటూ చంద్రమోహన్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు.