Senior Actress Jayakumari : సీనియర్ నటి.. 200 పైగా సినిమాలు.. కానీ ఇప్పుడు చికిత్సకి డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో..

ప్రముఖ సీనియర్ నటి జయకుమారి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 200 పైగా సినిమాలతో మెప్పించింది. ఒకప్పుడు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె నేడు చికిత్సకి డబ్బులు లేక................

Senior Actress Jayakumari : సీనియర్ నటి.. 200 పైగా సినిమాలు.. కానీ ఇప్పుడు చికిత్సకి డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో..

Senior Actress Jayakumari joined in Hospital

Updated On : September 19, 2022 / 10:09 AM IST

Senior Actress Jayakumari :  ప్రముఖ సీనియర్ నటి జయకుమారి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 200 పైగా సినిమాలతో మెప్పించింది. ఒకప్పుడు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె నేడు చికిత్సకి డబ్బులు లేక చెన్నై ప్రభుత్వాసుపత్రిలో సాయం కోసం ఎదురు చూస్తుంది.

ఇటీవల నటి జయకుమారి రెండు కిడ్నీలు దెబ్బతినడంతో చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ వాళ్ళు ఇచ్చే తాత్కాలిక చికిత్స తీసుకుంటుంది. ఎన్నో సినిమాల్లో చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగి జీవితం చివరి దశల్లో ఇలా ఇబ్బంది పడుతుండటంతో పలువురు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

Sita Ramam : నిజమైన రొమాన్స్ ఇండియన్ సినిమాలో ఇంకా బతికే ఉంది.. పోలాండ్ నుంచి సీతారామం సినిమాకి స్పెషల్ లెటర్..

ఈ విషయం తెలిసి అక్కడ లోకల్ రాజకీయనాయకులు కొంతమంది ఆమెని పరామర్శించి వారికి తోచిన సాయం చేశారు. భర్త ఎప్పుడో చనిపోవడం, కూతుర్లు పెళ్ళిళ్ళయి వెళ్లిపోవడం, ఒక్కడే కొడుకు ఉన్నా అతని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. మరి ఈ వార్త తెలుసుకొని ఎవరైనా జయకుమారికి సహాయం చేస్తారేమో చూడాలి