Sita Ramam : నిజమైన రొమాన్స్ ఇండియన్ సినిమాలో ఇంకా బతికే ఉంది.. పోలాండ్ నుంచి సీతారామం సినిమాకి స్పెషల్ లెటర్..

ఇటీవల సీతారామం సినిమా అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అవ్వగా విదేశీ ప్రేక్షకులని సైతం మెప్పిస్తుంది. విదేశీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలాండ్ నుంచి మోనికా అనే ఓ అమ్మాయి సీతారామం సినిమాకి...............

Sita Ramam : నిజమైన రొమాన్స్ ఇండియన్ సినిమాలో ఇంకా బతికే ఉంది.. పోలాండ్ నుంచి సీతారామం సినిమాకి స్పెషల్ లెటర్..

A Special Letter for Sita Ramam Movie from a Poland Girl

Sita Ramam : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచి మంచి విజయం సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. తరుణ్ భాస్కర్, రష్మిక, భూమిక, సుమంత్ ముఖ్యపాత్రలు పోషించగా సౌత్ లో మంచి విజయం సాధించిన సీతారామం సినిమాని ఇటీవలే హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా.

సీతారామం సినిమాని చూసిన ప్రేక్షకులు, ప్రముఖులు అంతా ఈ సినిమాని అభినందిస్తున్నారు. నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పై స్పందిస్తున్నారు. ఇక ఇటీవల సీతారామం సినిమా అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అవ్వగా విదేశీ ప్రేక్షకులని సైతం మెప్పిస్తుంది. విదేశీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలాండ్ నుంచి మోనికా అనే ఓ అమ్మాయి సీతారామం సినిమాకి ఫిదా అయిపోయి చాలా పెద్ద లేఖని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సినిమా టీంకి ట్యాగ్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Allu Arjun : పుష్ప 2 మొదలైంది.. తగ్గేదేలే.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తారు..

తెలుగులో ప్రియమైన డైరెక్టర్ హను రాఘవపూడి గారికి, దుల్కర్ గారికి, మృణాల్ ఠాకూర్ గారికి, రష్మికకి, చిత్ర యూనిట్ కి అంటూ హెడ్డింగ్స్ పెట్టి ఒక్కొక్కరి గురించి, వారి పాత్రల గురించి ఎంత బాగున్నాయో అంటూ వివరించింది ఈ లెటర్స్ లో. ఈ నాలుగు పేజీల లేఖని ట్విట్టర్లో పోస్ట్ చేసి.. “సీతారామం చిత్ర యూనిట్​కు పోలాండ్​ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అనేది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సినిమాని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ ట్వీట్ చేసింది. లేఖ చివర్లో నిజమైన రొమాన్స్ ఇండియన్ సినిమాల్లో ఇంకా బతికే ఉంది అని రాసింది. దీంతో ఈ పోలాండ్ యువతి రాసిన లేఖ వైరల్ గా మారింది.

ఇక ఈ లేఖ వైరల్ అవ్వడంతో.. దీనికి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, హను రాఘవపూడి చాలా ఎమోషనల్ గా రిప్లైలు ఇచ్చారు. ఇక రిప్లైలు రావడంతో మోనికా చాలా సంతోషంగా ఫీల్ అయింది. తన ట్విట్టర్లో సీతారామం సినిమా గురించి, ఇండియన్ సినిమా గురించి పొగుడుతూ పలు పోస్టులు పెడుతుంది. మొన్న RRR, ఇప్పుడు సీతారామం.. ఇలా విదేశీయులని సైతం మన సినిమాలు మెప్పించడం గర్వకారణం.