Prabhakar Bigg Boss Telugu : పాపం.. దారుణంగా బలైపోయాడు.. సుధీర్‌కు టెలివిజన్ నటుడు ప్రభాకర్ మద్దతు..
Prabhakar Bigg Boss Telugu 10 బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొన్నటి వరకు కాస్త చప్పగా సాగింది. కానీ..
Bigg Boss Telugu 10 serial actor Prabhakar supports Sudheer
Prabhakar Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొన్నటి వరకు కాస్త చప్పగా సాగింది. శనివారం నాగార్జున ఇచ్చిన దెబ్బకు కంటెస్టెంట్లు అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు అతిగా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ సుధీర్‌పై సృష్టి, త్రిగుణ్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
చేయని తప్పుకు సుధీర్‌ను దారుణంగా అవమానించడం, అతడిపై చెత్త విసరడం వంటి సంఘటనలు చూసి సగటు ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వేదికగా సీరియల్ నటుడు ప్రభాకర్ దీనిపై స్పందించారు. సుధీర్‌కు మద్దతు తెలుపుతూ.. సృష్టి, త్రిగుణ్ తీరును తప్పుబట్టారు.
హమ్మయ్యా నాకు ఫ్రీడమ్ లభించింది అని సుధీర్ అన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకుని సృష్టి, త్రిగుణ్‌లు అతడి క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించడం సరికాదన్నాడు. సాధారణంగా తాను ఇలాంటి వీడియోలు చేయనని, అయితే.. నిన్నటి ఎపిసోడ్ చూసినప్పటికి నుంచి మనసులో నుంచి పోవడం లేదన్నాడు. ఏ తప్పు చేయకపోయినప్పటికి కూడా సుధీర్ దారుణంగా బలైపోయాడని అనిపించిందని చెప్పుకొచ్చాడు. కంటెంట్ కోసం లేదా అటెన్షన్ కోసమే సృష్టి అలా చేసిందని అనిపిస్తుందని తెలిపాడు. గొడవకు త్రిగుణ్ ఆజ్యం పోసి రాక్షసానందం పొందుతున్నట్లుగా అనిపిస్తుందన్నాడు.
View this post on Instagram
ఇక సొసైటీలో కూడా నిజాయితీగా ఉండేవారి కంటే అబద్ధాలు చెబుతూ ఫేక్‌గా ఉండే వాళ్లకే ఎక్కువ మద్దతు దక్కుతోందన్నాడు. బిగ్‌బాస్‌లోనూ అదే రిప్లెక్ట్ అవుతోందని, నిజాయితీగా ఉన్న సుధీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదన్నారు.
కాగా.. సృష్టి, త్రిగుణ్‌లు చేసిన పనితో ఆటలో వెనుకబడిన సుధీర్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. అతడు విన్నర్ రేసులోకి వచ్చాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
