Shah Rukh Khan : నాతో సినిమా చేయండంటూ.. వేదికపై దర్శకుడిని బ్రతిమాలుకున్న షారుఖ్

గతంలో తనతో సినిమా చేసిన డైరెక్టర్‌ని మరోసారి సినిమా చేయమని ఓ స్టార్ హీరో చాలా కాలంగా అడుగుతున్నారు. కానీ ఎందుకో వారిద్దరి కాంబో రిపీట్ కాలేదు. ఇటీవల ఆ హీరో మరోసారి బహిరంగంగా ఆ డైరెక్టర్ ని అడిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Shah Rukh Khan : నాతో సినిమా చేయండంటూ.. వేదికపై దర్శకుడిని బ్రతిమాలుకున్న షారుఖ్

Shah Rukh Khan

Updated On : January 12, 2024 / 3:36 PM IST

Shah Rukh Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. మరొకరు దర్శక దిగ్గజం మణిరత్నం. 1998 లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దిల్ సే’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ కాలేదు. తనతో సినిమా చేయమంటూ షారుఖ్ మణిరత్నాన్ని చాలాసార్లు అడిగారు. కానీ ఎందుకో వీలు పడలేదు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో ఇదే విషయంపై షారుఖ్, మణిరత్నం మధ్య సరదా సంభాషణ జరిగింది.

Dheera Teaser : లక్ష్ చదలవాడ ‘ధీర’ టీజర్ చూశారా? డబ్బంటే నీకు ఎందుకు అంత పిచ్చి?

షారుఖ్ ఖాన్ 2023 లో పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో దూసుకుపోయారు. జవాన్, పఠాన్ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసాయి. డంకీ అనుకున్న స్ధాయిలో లేకపోయినా ఓవర్సీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. క్లాసిక్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకులు మణిరత్నం డైరెక్షన్‌లో షారుఖ్ ‘దిల్ సే’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అందుకు కారణాలు ఏమైనా వీరిద్దరూ ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో కలిసారు. ఇప్పటికే  పలుమార్లు తనతో సినిమా చేయమంటూ మణిరత్నాన్ని అడుగుతూ వస్తున్న షారుఖ్ ఖాన్ ఆ అవార్డుల కార్యక్రమం వేదికపై బహిరంగంగా తనతో సినిమా చేయమని మణిరత్నాన్ని రిక్వెస్ట్ చేసారు.

Thaina Fields : ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే చనిపోయిన నటి

‘బెగ్ చేస్తున్నా.. రిక్వెస్ట్ చేస్తున్నా.. ప్రతీసారి అడుగుతున్నా నాతో సినిమా చేయమని.. ఓపెన్‌గా అడుగుతున్నా నాతో సినిమా ఎప్పుడు చేస్తారని? అంటూ షారుఖ్ వేదికపై నుండి మణిరత్నాన్ని అడిగారు. అంతేకాదు ఈసారి విమానంపై ఛయ్యా..ఛయ్యా పాటకి స్టెప్పులేస్తాను అని కూడా చెప్పారు షారుఖ్. అందుకు మణిరత్నం నవ్వూతు ‘షారుఖ్ విమానం కొన్నాక తీస్తాను’ అన్నారు. ‘నా సినిమాలు ఎలా వెళ్తున్నాయో తెలుసుగా? విమానం దూరంలో లేదు’ అన్నారు షారుఖ్ నవ్వుతూ.. ‘విమానం కిందకు దించుతాను’ అని మణిరత్నం అనగానే ‘నేను వస్తున్నా.. వస్తున్నా’ అంటూ షారుఖ్ నవ్వులు పూయించారు. మణిరత్నం 37 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి మల్టీ టాలెంటెడ్ నటుడితో సినిమా చేయాలంటే అందుకు తగ్గ కథ ఉండాలని.. అది థగ్ లైఫ్ ద్వారా సాధ్యమైందని ఇదే వేదికపై మణిరత్నం చెప్పారు. ఇక షారుఖ్‌తో కూడా మణిరత్నం త్వరలోనే డైరెక్ట్ చేస్తారేమో వేచి చూడాలి.