Dheera Teaser : లక్ష్ చదలవాడ ‘ధీర’ టీజర్ చూశారా? డబ్బంటే నీకు ఎందుకు అంత పిచ్చి?

ఆల్రెడీ వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మెప్పించిన లక్ష్ త్వరలో ‘ధీర’ సినిమాతో రాబోతున్నాడు.

Dheera Teaser : లక్ష్ చదలవాడ ‘ధీర’ టీజర్ చూశారా? డబ్బంటే నీకు ఎందుకు అంత పిచ్చి?

Laksh Chadalavada Dheera Teaser Released

Updated On : January 12, 2024 / 2:48 PM IST

Dheera Teaser : ప్రస్తుతం యువ హీరోలు వరుసగా చిన్న సినిమాలతో, కొత్త కొత్త కంటెంట్స్ తో వస్తున్నారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు, యువ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada)చిన్నప్పుడే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మెప్పించిన లక్ష్ త్వరలో ‘ధీర’ సినిమాతో రాబోతున్నాడు.

తాజాగా ధీర సినిమా టీజర్ రిలీజయింది. టీజర్ మొదట్లో డబ్బంటే నీకు ఎందుకు అంత పిచ్చి అనే డైలాగ్ తో మొదలయి మధ్యలో హీరో ఎలివేషన్ షాట్స్ తో చివర్లో అంబులెన్స్ వస్తే సైడ్ ఇవ్వాలి, నా లాంటోడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి అనే మాస్ డైలాగ్ తో ముగించారు. డబ్బు కోసం హీరో ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ధీర సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ థియేటర్స్ వద్ద మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

ధీర సినిమాని విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. లక్ష చదలవాడ హీరోగా నటిస్తుండగా సోనియా బన్సల్, నేహా పతన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఈ టీజర్ రిలీజ్ తో మొదలుపెట్టారు. ఈ టీజర్ చూసేయండి మరి..