Shah Rukh Khan: “నరేంద్ర మోదీ”ని వీక్ ఆఫ్ తీసుకోమంటున్న షారుఖ్ ఖాన్..

నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో, సోషల్ మీడియా వేదికగా సాధారణ మనిషి దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయవేత్తలతో పాటు సినీ సెలెబ్రెటీస్ అయిన చిరంజీవి, అమితాబ్ లాంటి వాళ్ళు విష్ చేయగా, అందులో బాలీవుడ్ బాదుషా, విష్ చేసిన విధానం అందరికి గమ్మత్తుగా అనిపించింది.

Shah Rukh Khan: “నరేంద్ర మోదీ”ని వీక్ ఆఫ్ తీసుకోమంటున్న షారుఖ్ ఖాన్..

Shah Rukh Khan Variety Birthday Wishes to Narendra Modi

Updated On : September 17, 2022 / 6:42 PM IST

Shah Rukh Khan: నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో, సోషల్ మీడియా వేదికగా సాధారణ మనిషి దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయవేత్తలతో పాటు సినీ సెలెబ్రెటీస్ అయిన చిరంజీవి, అమితాబ్ లాంటి వాళ్ళు విష్ చేయగా, అందులో బాలీవుడ్ బాదుషా, విష్ చేసిన విధానం అందరికి గమ్మత్తుగా అనిపించింది.

Shah Rukh Khan: మమ్మల్ని రాక్షసులిగా చూపించారు – షారుఖ్

షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా.. “మన దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం పట్ల మీరు చూపే అంకితభావం చాలా ప్రశంసించబడింది. దేశం కోసం పోరాడాలంటే మీకు కొంత బలం, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఒక రోజు సెలవు తీసుకొని మీ పుట్టినరోజును ఆనందించండి సార్ అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేయగా. అది కాస్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్న ఈ మూవీతో షారుఖ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఇటీవల విడుదలైన “బ్రహ్మాస్త్ర” సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక చిన్న కామియో పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.