షారుఖ్ ఖాన్ ఇంట్లో ఒక రోజు ఉండే అవకాశం

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 12:31 AM IST
షారుఖ్ ఖాన్ ఇంట్లో ఒక రోజు ఉండే అవకాశం

Updated On : November 19, 2020 / 6:52 AM IST

Shah Rukh Khan’s Delhi home : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇంట్లో ఒక రోజు గడిపే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది ? అంటే..ఠక్కున ఎగిరి గంతేస్తారు కదూ. నిజంగానే వాళ్లింట్లో ఒక రోజు ఉండే అవకాశాన్ని కల్పించారు షారుఖ్. తమ అభిమాన నటుడిని ఒక్కసారైన కలవాలని, వారితో ఒక్క సెల్ఫీ దిగాలని చాలా మంది అనుకుంటుంటారు. సెల్ఫీతో సరిపెట్టుకోకుండా..ఏకంగా..ఇంటికి వెళ్లి..ఒక రోజు అతిథిగా ఉండే ఛాన్స్ కల్పించారు. అతిథుల రాకకోసం ఢిల్లీలో ఉన్న ఇంటిని షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ అందంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు గౌరి ఖాన్.



ఇంటికి సంబంధించిన ఫొటోలను అందులో ఉంచారు. పెళ్లైన కొత్తలో ఈ ఇంట్లో గడిపామని, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని పోస్టులో వెల్లడించారు. తమ ప్రేమ, తమ కుటుంబం తాలుకా గుర్తులున్నీ ఉన్నాయన్నారు. తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చారు. ఎయిర్ బిఎన్‌బి (Airbnb) వారితో కలిసి ప్రయోగానికి సిద్ధమౌతున్నట్లు వెల్లడించారు.



ఓ జంటకు తమ ఇంట్లో ఓ రోజు ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని షారుఖ్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. 2021, ఫిబ్రవరి 13వ తేదీన ఇంట్లో ఉండవచ్చని, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని ఎయిర్ బిఎన్‌బి సంస్థ వెల్లడించింది. మరి అదృష్టవంతులు ఎవరో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)