Jawan Movie : షారుఖ్ జవాన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..? ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్ అట్లీ..
జవాన్ సినిమాని తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Shahrukh Khan Jawan Movie Budget revealed by Director Atlee
Jawan Movie Budget : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. జవాన్ సినిమాని తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ ప్రెస్ మీట్ కి షారుఖ్, అట్లీ, దీపికా పదుకొనే.. పలువురు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు చిత్రయూనిట్. షారుఖ్ జవాన్ సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైందని, కరోనా వల్ల, మరికొన్ని కారణాల వల్ల జవాన్ సినిమా అప్పట్నుంచి సాగుతూనే ఉందని తెలిపాడు.
Shahrukh – Deepika : స్టేజిపై దీపికా – షారుఖ్ అదిరిపోయే డ్యాన్స్.. జవాన్ సాంగ్ కి స్టెప్పులు..
అట్లీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనాకు ముందు షారుఖ్ కి ఈ సబ్జెక్ట్ వినిపించాను. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ మూతపడ్డాయి. అలాంటి టైంలో అసలు సినిమాలు తీస్తారా, తీసినా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అని భయపడ్డాను. ఆ టైంలో నన్ను నమ్మి కనీసం 40 కోట్ల బడ్జెట్ అయినా పెట్టేవాళ్ళు ఉంటారా అనుకున్నాను. కానీ కరోనా సమయంలోనే నన్ను పూర్తిగా నమ్మి షారుఖ్ ఖాన్ 300 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి ఆ బడ్జెట్ ఇంకా దాటింది. అయినా షారుఖ్ ఎక్కడ రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు మాకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమా నేను షారుక్ కి రాసిన ప్రేమలేఖగా భావిస్తాను అని తెలిపాడు. దీంతో జవాన్ సినిమాకు 300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం జవాన్ సినిమాకు దాదాపు 350 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.