Constable Jayasanthi: చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్.. అంతా ప్లాన్ ప్రకారమే..! లేడీ కానిస్టేబుల్‌పై తీవ్ర విమర్శలు..!

మరో వివాదంలోనూ ఆమె చిక్కుకుంది. నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ హెడ్ కానిస్టేబుల్ కి జయశాంతి సహకరించినట్లు ఆరోపణలున్నాయి.

Constable Jayasanthi: చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్.. అంతా ప్లాన్ ప్రకారమే..! లేడీ కానిస్టేబుల్‌పై తీవ్ర విమర్శలు..!

Constable Jayasanthi Representative Image (Image Credit To Original Source)

Updated On : January 24, 2026 / 5:28 PM IST

 

  • గతంలో తప్పుడు సర్టిఫికెట్ తో డీఎస్సీలో ఉద్యోగం
  • నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న హెడ్ కానిస్టేబుల్ కి సహకారం
  • క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు
  • సానుభూతి కోసమే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్

Constable Jayasanthi: ఏపీలో చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన లేడీ కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం గుర్తుండే ఉంటుంది. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ సామర్లకోటలో రాత్రి పూట అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేసింది రంగంపేట కానిస్టేబుల్ జయశాంతి. అంతే, ఆమె వీడియో తెగ వైరల్ అవడం, ఉన్నతాధికారులు జయశాంతిని అభినందించడం జరిగాయి.

ఏకంగా హోంమంత్రి అనిత సైతం ఆమెను ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిందని కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. కట్ చేస్తే.. ఆ లేడీ కానిస్టేబుల్ అసలు కథ బయటకు రావడంతో దుమారం రేగింది. తనపై గతంలో ఉన్న విమర్శలు పొగొట్టుకునేందుకే జయశాంతి ట్రాఫిక్ క్లియర్ చేసి హడావిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తప్పుడు సర్టిఫికెట్ తో డీఎస్సీ ఉద్యోగం..!

జయశాంతి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 2025 డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందినట్లు జయశాంతిపై ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పని చేస్తున్న భర్త సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా చూపి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు టీచర్ ఉద్యోగం రద్దు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసిందని, జయశాంతిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు కాకినాడ డీఈవో. ఇదే కాదు మరో వివాదంలోనూ ఆమె చిక్కుకుంది. నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ హెడ్ కానిస్టేబుల్ కి జయశాంతి సహకరించినట్లు ఆరోపణలున్నాయి.

ఆ విమర్శల నుంచి బయటపడేందుకే ఈ ప్లాన్..!

ఇక ఇప్పుడు చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడం ద్వారా జయశాంతి హైలైట్ అయ్యింది. అయితే, ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని జయశాంతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్తను బదిలీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని సైతం బదిలీ చేశారు.

భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యలు, డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగంతో తీవ్ర విమర్శలపాలైన జయశాంతి.. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ వ్యవహారంలో వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Also Read: అమెరికాలో భార్యతో పాటు ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయుడు

 

 

 

View this post on Instagram

 

A post shared by Informed (@informed.in)