హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న పిల్లలు?

కాంప్లెక్స్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది పగలకొడుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతోంది.

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న పిల్లలు?

Massive Fire Breaks Out in Four-Storey Building at Nampally

Updated On : January 24, 2026 / 6:34 PM IST
  • గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఫర్నీచర్‌ షాప్‌లో మంటలు
  • ఘటనాస్థలికి చేరుకున్న సీపీ సజ్జనార్
  • సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురు?

Nampally Fire Accident: హైదరాబాద్‌ నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని నాలుగు అంతస్తుల భవంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఫర్నీచర్‌ షాప్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సెల్లార్‌లో ఇద్దరు కార్మికులు, ఇద్దరు పిల్లలు, ఓ మహిళ చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 10TVతో ఓ బాధిత కుటుంబం మాట్లాడుతూ.. “మేము పని చేసుకుని బతుకుతాం. మా ఇద్దరు పిల్లలు భవనంలో లోపల ఉన్నారు. వాళ్ల ఆచూకీ ఇంకా లభించలేదు. దయచేసి వారిని కాపాడండి” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌ గేమ్ ఓవర్.. దాని ప్లేస్‌లో ఆడే కొత్త టీమ్‌ ఇదే..

కాంప్లెక్స్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది పగలకొడుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతోంది. కాంప్లెక్స్ పైన ముగ్గురు సృహతప్పి పడిపోయినట్లు సమాచారం.

సెల్లార్‌లో ఫర్నీచర్ కూడా ఉండడంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టతరంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌లో రోబోను వాడుతున్నారు. ఘటనాస్థలికి సీపీ సజ్జనార్ చేరుకున్నారు.