Vivo X100 Pro : ఇది కదా డిస్కౌంట్.. వివో X100 ప్రోపై ఏకంగా రూ.31వేలు తగ్గింపు.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo X100 Pro : వివో x100 ప్రో ధర భారీగా తగ్గింది.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 31వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo X100 Pro : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ టైమ్.. వివో X100 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్ ఉంటుంది.

ముఖ్యంగా ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 50MP ప్రైమరీ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఈ వివో ఫోన్ అసలు ధర రూ. 89,999 ఉండగా ఇప్పుడు రూ. 60వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

కార్డు, బ్యాంక్ ఆఫర్లతో ఈ వివో ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. అమెజాన్‌లో వివో X100 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో వివో X100 ప్రో ధర ఎంతంటే? : ఈ వివో X100 ప్రో అసలు ధర రూ.89,999 ఉండగా అమెజాన్‌లో రూ.31వేల తగ్గింపుతో లభ్యమవుతోంది. ప్రస్తుత ధర రూ.58,999కి తగ్గింది. ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాదు.. క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,500 సేవ్ చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ.2,074 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ.42,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అయితే, ఫైనల్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు : వివో X100 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉంటుంది. ఈ వివో ఫోన్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ నుంచి పవర్ పొందుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వివో X100 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో జీఈఐఎస్ఎస్ ట్యూన్ 50MP సోనీ IMX989 సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా , OIS 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14పై రన్ అవుతుంది. ఈ వివో ఫోన్ 100W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,400mAh బ్యాటరీని అందిస్తుంది.
