Shama Sikandar : సినిమా చేయకపోయినా అలా అడిగేవాళ్లు.. క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన మరో బాలీవుడ్ హీరోయిన్..

షామా సికందర్ మాట్లాడుతూ.. ''గతంలో ఉన్నంత కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు కొందరు దర్శక నిర్మాతలు మాకు ఆఫర్స్ కావాలంటే వారితో బెడ్ షేర్ చేసుకోమని అడిగేవారు. కొంతమందైతే...............

Shama Sikandar : సినిమా చేయకపోయినా అలా అడిగేవాళ్లు.. క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన మరో బాలీవుడ్ హీరోయిన్..

Shama Sikandar speaks about Casting Couch in Bollywood

Updated On : September 16, 2022 / 9:03 AM IST

Shama Sikandar :  అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉన్నా సినీ పరిశ్రమలోనే ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆఫర్లు కావాలంటే హీరోయిన్స్, లేడి ఆర్టిస్టులని తమతో బెడ్ షేర్ చేసుకోవాలని కొంతమంది అడిగేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా చాలా వరకు కాస్టింగ్ కౌచ్ అనేది కనుమరుగైంది. అప్పుడప్పుడు ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. మీటూ ఉద్యమం వచ్చాక కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కున్న చాలా మంది నటీమణులు, హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

బాలీవుడ్ లో ఈ కాస్టింగ్ కౌచ్ మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. తాజాగా మరో బాలీవుడ్ భామ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. బాలీవుడ్ భామ షామా సికందర్ కాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని మాట్లాడింది.

Rashmika Mandanna : నా బాల్యం అంతా హాస్టల్ లోనే అయిపోయింది.. స్నేహితులే నా కుటుంబం.. ఎమోషనల్ అయిన రష్మిక..

షామా సికందర్ మాట్లాడుతూ.. ”గతంలో ఉన్నంత కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు కొందరు దర్శక నిర్మాతలు మాకు ఆఫర్స్ కావాలంటే వారితో బెడ్ షేర్ చేసుకోమని అడిగేవారు. కొంతమందైతే వాళ్ళతో సినిమాలు చేయకపోయినా అడిగేవారు. ప్రశ్నిస్తే వేరే ఎక్కడా కూడా ఆఫర్స్ రాకుండా చేస్తాము అని బెదిరించేవారు. నేను కూడా గతంలో ఈ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. కానీ ఇప్పుడు పరిశ్రమ అలా లేదు. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సేఫ్. ఇప్పటి యువ దర్శకులు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటి కాస్టింగ్ కౌచ్ గురించి వాళ్ళు ఆలోచించరు. అలా అని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పట్లేదు. కానీ గతంతో పోలిస్తే చాలా తక్కువ” అని తెలిపింది.

మరోసారి బాలీవుడ్ లో హీరోయిన్ షామా సికిందర్ ఇలా కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.