Shanmukh Jaswanth : యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం.. బాధలో షన్ను..

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక షన్నుకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో షన్ను ఎక్కువగా బాధపడ్డాడు. ప్పుడు మరో బాధ షన్నుని...........

Shanmukh Jaswanth : యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం.. బాధలో షన్ను..

Shanmukh

Updated On : May 30, 2022 / 10:28 AM IST

Shanmukh Jaswanth :  షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. అతి తక్కువ టైంలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్ సాధించిన తెలుగు యూట్యూబర్ గా కూడా రికార్డ్ సాధించాడు షణ్ముఖ్. ఈ ఫేమ్ తో బిగ్‌బాస్ లో కూడా పాల్గొని అందర్నీ మెప్పించాడు. త్వరలో మరో కొత్త సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు షణ్ముఖ్. తాజాగా షన్ను ఇంట్లో విషాదం నెలకొంది.

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక షన్నుకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో షన్ను ఎక్కువగా బాధపడ్డాడు. ఇప్పటికి కూడా దీప్తి గురించి సన్నిహితుల వద్ద బాధపడతాడని సమాచారం. ఆ బాధని మర్చిపోవడానికి వర్క్ లో బిజీ అవుతున్నాడు షన్ను. ఇప్పుడు మరో బాధ షన్నుని మరింత కలిచివేస్తుంది. తాజాగా షన్ను బామ్మ మరణించారు. షన్ను వాళ్ళ బామ్మతో మాట్లాడుతుండగా తీసిన ఓ వీడియోని షేర్ చేసి RIP అని బాధపడుతూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు.

Vishnu Priya : హీరోయిన్ అవ్వకుండానే చనిపోతా అనుకున్నా.. కానీ రాఘవేంద్రరావు గారి వల్ల..

ఆ వీడియోలో షన్ను బామ్మని నా పెళ్లి అయ్యే దాకా ఉండవా అంటే బామ్మ ఏమో ఉంటానో ఉండనో అని అంటుంటే వెనకనుంచి షన్ను పెళ్లి అయ్యేదాకా ఉంటావు అని ఎవరో అన్నారు. ఈ వీడియోని షేర్ చేసి నా పెళ్లి చూడకుండానే బామ్మ వెళ్లిపోయిందని షన్ను బాధపడుతున్నాడు. షన్ను బామ్మ మరణంతో కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు.