Oke Oka Jeevitham : జీవితానికి, టైం మిషన్‌కి సంబంధం ఏంటి?

ఆసక్తికరంగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ టీజర్..

Oke Oka Jeevitham : జీవితానికి, టైం మిషన్‌కి సంబంధం ఏంటి?

Oke Oka Jeevitham

Updated On : December 29, 2021 / 5:43 PM IST

Oke Oka Jeevitham: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్, రీతు వర్మ జంటగా నటిస్తున్న సినిమా.. ‘ఒకే ఒక జీవితం’.. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌ుడిగా చేస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్. ఆర్. ప్ర‌కాష్ బాబు, ఎస్.ఆర్. ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాస్తుండడం విశేషం.

Sitara – Mahesh Babu : దుబాయ్‌లో సితార పాపతో సూపర్‌స్టార్..

తమిళ్‌లో ‘కణం’ పేరుతో తెరకెక్కుతోంది. కొంత గ్యాప్ తర్వాత ‘ఒకే ఒక జీవితం’ సినిమా కథతో పాటు క్యారెక్టర్ నచ్చడంతో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Bro Daddy : మోహన్ లాల్ – పృథ్వీరాజ్‌ల ‘బ్రో డాడీ’ లుక్ వచ్చేసింది..

కథ ఏంటనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు టీజర్‌లో. టైం మిషన్ కాన్సెప్ట్‌తో, సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. థ్రిల్‌కి గురిచేసే అంశాలతో పాటు లవ్, చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

నాజర్‌తో టీజర్ నేరేట్ చేయించి ఆసక్తి కలిగించారు. శర్వా తన మార్క్ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా.. మంచి క్యారెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తూ అమల అలరించనున్నారు. సుజీత్ సారంగ్ విజువల్స్, జేక్స్ బీజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కానుంది.