నో కిస్సింగ్ రూల్ : హృతిక్ తో ముద్దా? అయితే ఓకే

మిల్క్ బ్యూటీ తమన్నా అనగానే అందరికి గుర్తుచ్చే చిత్రం. బాహుబలి చిత్రంలో అవంతిక. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమన్నా టాలీవుడ్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది

  • Published By: sreehari ,Published On : March 1, 2019 / 02:28 PM IST
నో కిస్సింగ్ రూల్ : హృతిక్ తో ముద్దా? అయితే ఓకే

Updated On : March 1, 2019 / 2:28 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా అనగానే అందరికి గుర్తుచ్చే చిత్రం. బాహుబలి చిత్రంలో అవంతిక. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమన్నా టాలీవుడ్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది

మిల్క్ బ్యూటీ తమన్నా అనగానే అందరికి గుర్తుచ్చే చిత్రం. బాహుబలి చిత్రంలో అవంతిక. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమన్నా టాలీవుడ్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. తమన్న ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ చిత్రంలో కిస్సింగ్ క్లాజ్ రూల్ ఉంటుంది.

సినిమా ఒప్పుకున్నప్పుడే ముద్దు సీన్లకు తమన్నా ముందుగానే నో చెప్పేస్తుంది. అలా అయితే కాంట్రాక్ట్ కు ఓకే చెబుతుందనేది సినీవర్గాలకు తెలిసిన విషయమే. అదే.. హృతిక్ తో ముద్దు సీన్ అయితే ఓకే అంటోంది తమన్నా. ఇటీవల ఫామస్ లీ ఫిల్మ్ ఫేర్ (తమిళ్) కార్యక్రమంలో తమన్నా ఈ విషయాన్ని చెప్పింది. 

‘‘సాధారణంగా స్క్రీన్ పై కిస్సింగ్ సీన్ చేయను. అది నా సినిమా కాంట్రాక్ట్ లో ఒక భాగం కూడా. నా స్నేహితులతో అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను. అదే.. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ అయితే.. యా..యా.. ముద్దుకు రెడీ.. ’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

హృతిక్ ను తొలిసారి కలిసినప్పటి అనుభవాన్ని తమన్నా ఈ సందర్భంగా అందరితో పంచుకుంది. తనతో కలిసి ఫొటో దిగాలనే కోరికను హృతిక్ అర్థం చేసుకొని ఫొటో కావాలా? అని అడిగాడని, వెంటనే.. అవును ఫొటో కావాలి అని చెప్పి కలిసి ఫొటో దిగినట్టు తమన్నా చెప్పుకొచ్చింది.