Sherlyn Chopra : రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

 ఇటీవల బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసు కొన్ని రోజులు సాగింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై జైలు నుంచి బయటకు

Sherlyn Chopra : రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

Sherlyn

Updated On : October 16, 2021 / 2:14 PM IST

Sherlyn Chopra :  ఇటీవల బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసు కొన్ని రోజులు సాగింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక రాజ్ కుంద్రా అరెస్ట్ అవటంతో తమని మోసం చేసారంటూ కొంతమంది మోడల్స్, హీరోయిన్స్ రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేశారు. తాజాగా రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టిపై బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Manchu Vishnu: అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. మంత్రి తలసాని ప్రశంసలు

రాజ్ కుంద్రా నన్ను తనను మోసం చేశాడని అంతేకాక మానసిక క్షోభకు కూడా గురి చేశారని ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసింది షెర్లిన్. రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు కూడా గురి చేశారని, తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కుంద్రా, శెట్టి తనను బెదిరించారని ఈ ఫిర్యాదులో తెలిపింది. అంతేకాక రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందని, వారి ద్వారా కూడా తనను బెదిరించారని చెప్పారు. షెర్లిన్ అంతకు ముందు కూడా రాజ్ కుంద్రా పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే రాజ్ కుంద్రా తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడని తెలిపింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో కోరింది షెర్లిన్ చోప్రా.