Manchu Vishnu: అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. మంత్రి తలసాని ప్రశంసలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.

Manchu Vishnu: అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. మంత్రి తలసాని ప్రశంసలు

Manchu Vishnu

Updated On : October 16, 2021 / 12:55 PM IST

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజే ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు హాజరయ్యారు.

Bigg Boss 5: డేంజర్ జోన్ లో ముగ్గురు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఇక, ముందే అనుకున్నట్లుగా ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌కు చెందిన వారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరవగా.. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు కూడా దూరంగా ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోహన్ బాబు, విష్ణులపై ప్రశంసలు కురిపించారు. మా అసోసియేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలా అండదండగా ఉంటుందని చెప్పిన మంత్రి.. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

Pushpa: బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్.. ఫలితం ఎలా ఉంటుందో!

మా సభ్యులంతా కలిసి మంచి ప్యానెల్‌ను ఎన్నుకున్నారని ప్రశంసించిన తలసాని.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో జరిగిన మా ఎన్నికలలో విష్ణు గెలుస్తాడని నాకు ముందే తెలుసని.. 10 రోజుల ముందే ఫోన్ చేసి చెప్పానన్నారు. హైదరాబాద్ సినిమా హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించారని.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మంచు విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసమే నిర్మాతలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సింగిల్ విండో అనుమతులు ఇచ్చామని మంత్రి తలసాని చెప్పారు.