సమంత ప్లేస్‌లో శ్రద్ధ
ఇరుంబు తిరై సీక్వెల్‌లో సమంతకు బదులు శ్రద్ధ శ్రీనాధ్ నటించనుంది..

ఇరుంబు తిరై సీక్వెల్‌లో సమంతకు బదులు శ్రద్ధ శ్రీనాధ్ నటించనుంది..
విశాల్, సమంత జంటగా.. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఇరుంబు తిరై, తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ అయ్యింది. రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందనుంది. ఆనంద్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. విశాల్ పక్కన హీరోయిన్‌గా సమంత బదులు శ్రద్ధ శ్రీనాధ్ నటించనుంది.
ఆమెది పోలీస్ క్యారెక్టర్ అని కోలీవుడ్ టాక్. ఇటీవలే జెర్సీతో మంచి హిట్ అందుకున్న శ్రద్ధ, ఇంతకుముందు ఒక ఇంటర్వూలో ‘యూటర్న్ సినిమా చూసారా’? అనడిగితే.. ‘అరగంటచూసి ఆపేసాను, నా క్యారెక్టర్‌లో వేరే వాళ్ళని చూడలేక పాయాను’ అని కామెంట్ చేసింది.
ఎందుకంటే యూటర్న్ ఒరిజినల్ వెర్షన్‌లో శ్రద్ధ చేసిన క్యరెక్టరే తెలుగులో సమంత చేసింది. సో, ఇప్పుడు సమంత నటించిన సినిమా సీక్వెల్‌లో ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధ.. ఈ నెలాఖరునుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.