Shruti Haasan : మెగాస్టార్‌కి జోడిగా కమల్ కూతురు..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి 154వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జాలర్ల కథతో సముద్రం దగ్గర ఉండనుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు...

Shruti Haasan : మెగాస్టార్‌కి జోడిగా కమల్ కూతురు..

Shruthi

Updated On : March 8, 2022 / 9:38 PM IST

 

Shruti Haasan :  ప్రస్తుతం చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలకి ఓకే చెప్తూ ఒకదాని వెంట ఒకటి షూటింగ్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే చిరు చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి ఉండగా మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో బాబీ దర్శకత్వలో తెరకెక్కే సినిమా ఒకటి.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి 154వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జాలర్ల కథతో సముద్రం దగ్గర ఉండనుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఫుల్ మాస్ పోస్టర్ లా ఉండటంతో సినిమాపై అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

Prithviraj Sukumaran : ‘సలార్‌‍’లో మలయాళం స్టార్ హీరో.. ప్రెస్‌మీట్‌లో లీక్ చేసిన ప్రభాస్

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిరంజీవి. ఇవాళ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని హీరోయిన్‌ ని ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శృతిహాసన్ కి చిరంజీవి పుష్ప గుచ్చం ఇస్తున్న ఫోటోని షేర్ చేస్తూ..”ఉమెన్స్ డే రోజు శృతిహాసన్ ని ఈ సినిమాలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు మెగాస్టార్. ఇప్పటికే శృతిహాసన్ అటు ప్రభాస్, బాలయ్యలతో నటిస్తూ ఇటు మెగాస్టార్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది.