Shruti Haasan : శృతి హాసన్ వీపుపై త్రిశూలంతో టాటూ.. దాని అర్ధమేంటో తెలుసా?

శృతి హాసన్ తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా తన వీపుపై త్రిశూలం గుర్తుతో వేయించుకున్న టాటూ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి మరోసారి వైరల్ అయ్యారు.

Shruti Haasan : శృతి హాసన్ వీపుపై  త్రిశూలంతో టాటూ.. దాని అర్ధమేంటో తెలుసా?

Shruti Haasan

Updated On : November 21, 2023 / 3:51 PM IST

Shruti Haasan : నటి శృతి హాసన్ ఎక్కువగా వార్తల్లో ఉంటారు. తాజాగా వీపుపై త్రిశూలంతో ఉన్న టాటూతో కనిపించడమే కాదు ఆసక్తికరమైన ట్వీట్‌తో అభిమానుల్ని గందరగోళంలో పడేశారు.

IFFI 2023 : సినీ ఇండస్ట్రీ అభివృద్దికి కేంద్రం ఎన్ని కోట్లు ప్రకటించిందో తెలుసా?

లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఎక్కువగా వార్తల్లో ఉంటారు. తన బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యారు . రీసెంట్‌గా తన వీపుపై వేయించుకున్న టాటూ ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తమిళ అక్షరాల్లో త్రిశూలంతో ఉన్న మురుగన్ వేల్ టాటూను ఆమె ప్రదర్శించారు.

శృతి హాసన్ ‘తను ఎప్పుడూ ఆధ్మాత్మికత వైపు మొగ్గు చూపుతానని, మురుగన్ వేల్‌కు తన మనసులో ప్రత్యేక స్ధానం ఉందని అది ఈ పచ్చబొట్టు ద్వారా ప్రదర్శించాలనుకున్నాని’ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ ‘తను అన్నింటి నుంచి బయటకు రావాలని అనుకుంటున్నానని, ఇకపై తాను లేచి నిలబడటం నేర్చుకుంటున్నానని.. తను ఏది చేసిన తన స్టైల్లో చేస్తానని తన దారి రహదారి లేదా బైపాస్’ అంటూ శీర్షిక పెట్టారు. ఈ మాటలకు అర్ధం తెలీక ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు.

Shivathmika Rajashekar : శివాత్మిక హాట్ క్లోజప్ ఫొటోస్..

బాలీవుడ్ సినిమా లక్‌తో ఎంట్రీ ఇచ్చిన శృతి ధనుష్, సూర్యలతో సినిమాలు చేసి పాపులర్ అయ్యారు. ఇటు తెలుగులో స్టార్ హీరోల పక్కన చేసి హిట్లు కొట్టారు. తాజాగా ప్రభాస్‌తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Shruti Haasan

Shruti Haasan

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)