Sid Sriram : నచ్చేశావే పిల్ల నచ్చేశావే.. అంటూ దోసుకుపోతున్న సిద్ శ్రీరామ్ సాంగ్..
ఇటీవల "నచ్చేసావే పిల్లా నచ్చేసావే.." అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.

Sid Sriram Song Nachesave Pilla Nachesave from Mechanic Movie goes viral
Sid Sriram : టీనా శ్రీ క్రియేషన్స్ పతాకం పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్స్ గా నాగ మునెయ్య నిర్మాతగా ముని సహేకర రచన-దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మెకానిక్’ – ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే సెన్సార్ పూర్తిచేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా నుంచి ఇటీవల “నచ్చేసావే పిల్లా నచ్చేసావే..” అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. దీంతో ఈ పాట యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా యూట్యూబ్ లో ఈ సాంగ్ 7 మిలియన్స్ అంటే 70 లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది.
సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఈ సందర్భంగా నిర్మాత నాగ మునెయ్య మాట్లాడుతూ.. వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే సిద్ శ్రీరామ్ పాడిన పాట “నచ్చేసావే పిల్లా నచ్చేసావే” ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ముందు విడుదల అయిన ‘టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి’ అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా మెకానిక్ చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.