Samantha : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, సమంత హీరోయిన్? నందిని రెడ్డి దర్శకత్వంలో.. ఇదెక్కడి కాంబోరా బాబు?

అన్ని మంచి శకునములే సినిమా రిలీజ్ కి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Samantha : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, సమంత హీరోయిన్? నందిని రెడ్డి దర్శకత్వంలో.. ఇదెక్కడి కాంబోరా బాబు?

Siddhu Jonnalagadda and Samantha movie in Nandini Reddy Direction

Updated On : May 18, 2023 / 6:37 AM IST

Nandini Reddy : టాలీవుడ్(Tollywood) మహిళా దర్శకురాలలో నందిని రెడ్డి ఒకరు. అలా మొదలైంది(Ala Modalaindi) సినిమాతో ఎంట్రీతోనే హిట్ కొట్టిన నందిని కల్యాణ వైభోగమే, ఓ బేబీ(Oh Baby) లాంటి సినిమాలను అందించింది. ప్రస్తుతం అన్ని మంచి శకునములే(Anni Manchi Shakunamule) అనే సినిమాతో రాబోతుంది. సంతోష్ శోభన్(Santosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా సిద్ధూ జొన్నలగడ్డతో తీయబోతున్నాను. నా నెక్స్ట్ సినిమాలో పెళ్ళిళ్ళు, కుటుంబాలు ఏమి ఉండవు. ఎవ్వరూ ఊహించని కథతో, ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా చేయబోతున్నాను అని తెలిపింది. దీంతో అసలు సిద్ధూ జొన్నలగడ్డతో నందిని రెడ్డి సినిమానా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Bholaa Shankar : ఇంద్ర లొకేషన్స్‌లో భోళా శంకర్ సాంగ్ షూటింగ్.. మరో దాయి దాయి దామ్మా!

అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. సమంత, నందిని రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. గతంలో వీరిద్దరూ కలిసి ఓ రెండు సినిమాలు కూడా చేశారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా కూడా ఉంటుందని గతంలోనే చెప్పారు. అయితే అది సిద్ధూ జొన్నలగడ్డ సినిమానే అవుతుందని, ఇందులోనే సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. దీంతో సిద్ధూ పక్కన సమంత ఏంటి, ఈ కాంబోకి నందిని రెడ్డి డైరెక్షన్ ఏంటో అని ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.