Siddhu Jonnalagadda : నాని ఆ సినిమా సరిగ్గా తీయలేదు.. అన్‌స్టాపబుల్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన డీజే టిల్లు..

బాలయ్య సరదాగా ఓ గేమ్ ఆడించాడు వీళ్ళతో అందులో వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నాడు. సిద్ధుకి ఏ రీమేక్ సరిగ్గా తీయలేదు అనిపించింది అనే ప్రశ్న వచ్చింది. బాలయ్య తెలుగులో వచ్చిన రీమేక్ సినిమాలే చెప్పాలన్నాడు. సిద్ధు చాలా సేపు ఆలోచించి.............

Siddhu Jonnalagadda : నాని ఆ సినిమా సరిగ్గా తీయలేదు.. అన్‌స్టాపబుల్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన డీజే టిల్లు..

Siddhu Jonnalagadda spoke about nani's aha kalyanam movie in Unstoppable show

Updated On : October 21, 2022 / 2:12 PM IST

Siddhu Jonnalagadda :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. బాలయ్య సరదాగా ఓ గేమ్ ఆడించాడు వీళ్ళతో అందులో వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నాడు. సిద్ధుకి ఏ రీమేక్ సరిగ్గా తీయలేదు అనిపించింది అనే ప్రశ్న వచ్చింది. బాలయ్య తెలుగులో వచ్చిన రీమేక్ సినిమాలే చెప్పాలన్నాడు. సిద్ధు చాలా సేపు ఆలోచించి.. బ్యాండ్ బాజా బారత్ సినిమాని తెలుగులో ఆహ కళ్యాణం సినిమాగా రీమేక్ చేశారు. అది ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు అనిపించింది. వరిజినల్ ఫ్లేవర్, మన ఇక్కడి ఫ్లేవర్ డిఫరెంట్. ఎందుకో ఆ సినిమా ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు తీయలేదు అనిపించింది అన్నాడు. విశ్వక్ నాని అన్న సినిమా బాగోలేదు అంటావా అని అంటే బాలకృష్ణ.. నాని నా ఫ్యాన్ అని తెలిసి కూడా అతని సినిమా బాగోలేదు అంటావా అన్నారు. సిద్ధు.. నాని అన్న సినిమా అని కాదు, నాకు అనిపించింది సర్, మీరు అడిగితేనే చెప్పాను అన్నాడు. దీంతో బాలయ్య సరదాగా అన్నాను అనడంతో అందరు నవ్వేశారు.

Siddhu Jonnalagadda : బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకోని నాకు ఫోన్ చేశారు.. నేను కాదని తెలిశాక..

అయితే నాని కెరీర్ ఆరంభంలో హీరోగా చేసిన ఆహా కళ్యాణం సినిమా బాగోలేదు అనడంతో నానిని అనకపోయినా ఆ సినిమాని అన్నారని కొంతమంది ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై నాని ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.