Tillu Square : ఎట్టకేలకు డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ డేట్ ఫైనల్.. టిల్లు స్క్వేర్ ఎప్పుడొస్తుందా తెలుసా?

ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ పలుమార్లు వాయిదా పడగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Tillu Square : ఎట్టకేలకు డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ డేట్ ఫైనల్.. టిల్లు స్క్వేర్ ఎప్పుడొస్తుందా తెలుసా?

Siddhu Jonnalagadda Tillu Square Movie New Release Date Announced

Updated On : October 27, 2023 / 11:22 AM IST

Tillu Square : డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది డీజే టిల్లు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడో ప్రకటించినా, షూటింగ్ కూడా అయిపోయినా సినిమా మాత్రం వాయిదా పడుతూ వస్తుంది.

డీజే టిల్లుకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడా? దొరికిపోయాను అంటూ సిగ్గుపడిపోతూ..

ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ పలుమార్లు వాయిదా పడగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2024 ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.