‘SIN’, ఆహా.. యూత్‌‌కి మత్తెక్కిస్తుంది!

‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త వెబ్ సిరీస్ ‘SIN’ యువతని ఆకట్టుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : March 25, 2020 / 11:18 AM IST
‘SIN’, ఆహా.. యూత్‌‌కి మత్తెక్కిస్తుంది!

Updated On : March 25, 2020 / 11:18 AM IST

‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త వెబ్ సిరీస్ ‘SIN’ యువతని ఆకట్టుకుంటోంది..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అమెజాన్,  నెట్ ఫ్లిక్స్‌కు ధీటుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు వెబ్ సిరీస్‌లు, లెటెస్ట్ మూవీస్ ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చాయి. కాన్సెప్ట్ పరంగా బోల్డ్ నెస్ ఉన్నా సినిమాలో చూపించిన దానికి కంటే వెబ్ సిరీస్‌లోనే కంఫర్ట్ ఎక్కువ. తాజాగా బోల్డ్ అండ్ రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘SIN’ అనే కొత్త సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

‘Nice 2 Meet U’, ‘బాబు బాగా బిజీ’ వంటి రొమాంటిక్ సినిమాల దర్శకుడు నవీన్ మేడారం డైరెక్షన్లో, శరత్ మరార్ నిర్మించి ‘SIN’ యువతని బాగా ఆకట్టుకుంటోంది. జెన్నిఫర్, తిరువీర్, దీప్తి ప్రధాన పాత్రల్లో నటించిన ‘SIN’ ‘ఆహా’ లో చూడొచ్చు.