Mrunal Thakur : మృణాల్ ఠాకూర్‌తో ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన సింగర్
మృణాల్ ఠాకూర్ బాద్షాలపై వచ్చిన డేటింగ్ పుకార్లపై బాద్షా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Mrunal Thakur
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. బాద్షా లవ్ బర్డ్స్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ గుప్పుమంది. శిల్పా శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ జంట చేతులు పట్టుకుని కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై బాద్షా క్లారిటీ ఇచ్చారు.
Rachin Ravindra : రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి
ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియాని బాద్షా అని పిలుస్తారు. ర్యాపర్, సింగర్, లిరిసిస్ట్ అయిన బాద్షా, నటి మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. నటి శిల్పా శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో చేయి చేయి పట్టుకుని కనిపించారు. గ్రీన్ కలర్ డ్రెస్సులో మృణాల్, బ్లాక్ కుర్తాలో బాద్షా అమెను అనుసరిస్తూ ముందుకు నడిచారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై బాద్షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ మెసేజ్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
బాద్షా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇంటర్నెట్‌ను నిరాశ పరిచినందుకు చింతిస్తున్నానని, అయితే అందరూ ఆలోచించేది కాదు అని రాశారు. మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ పుకార్లను బాద్షా డైరెక్ట్‌గా ప్రస్తావించలేదు. ‘ప్రియమైన ఇంటర్నెట్, మిమ్మల్ని మరోసారి నిరాశపరిచినందుకు క్షమించండి. అయితే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అలాంటిది ఏమీ లేదు’ అని బాద్షా రాశారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు.
ఆ మధ్య మృణాల్ ఠాకూర్ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని మృణాల్ ఖండించారు. మృణాల్ లేటెస్ట్‌గా ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘పిప్పా’ సినిమాలో కనిపించారు. నాని ప్రధాన పాత్రలో వస్తున్న ‘హాయ్ నాన్న’ లో మృణాల్ నటించారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Mrunal Thakur