Chinmayi Sripaada : లోన్ యాప్‌లు మార్ఫింగ్ ఫోటోలతో మహిళల్ని వేధిస్తున్నాయి.. ఆ సింగర్ ఆరోపణలు
లోన్ యాప్‌ల ఏజెంట్లు మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సింగర్ చిన్మయి శ్రీపాద. సామాన్యులకు డీప్‌ఫేక్ వీడియో ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Singer Chinmayi
Chinmayi Sripaada : లోన్ తీసుకున్న మహిళల్ని లోన్ యాప్‌ల ఏజెంట్లు వేధిస్తున్నారని ఆరోపించారు సింగర్ చిన్మయి. వారి ఫోటోలను పోర్న్ ఫోటోలతో మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
నటి రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన సింగర్ చిన్మయి శ్రీపాద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను సెలబ్రిటీలను వేధించడానికి మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. లోన్ యాప్‌ల నుంచి రుణం తీసుకున్న మహిళల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏజెంట్లు వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ చిన్మయి ఆరోపించారు.
Chinmayi : సమంత పై వచ్చే ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే..
డీప్‌ఫేక్ అనేది గుర్తించడం కష్టంగా ఉంటుందని.. బాలికల డీప్‌ఫేక్‌ల ప్రమాదాలపై సామాన్యులకు అవగాహన కల్పించడంతో పాటు.. వాటిని ఎదుర్కునే విధంగా దేశ వ్యాప్తంగా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందని చిన్మయి అభిప్రాయపడ్డారు. నటి రష్మిక ఎలివేటర్‌లోకి వెళ్తున్నట్లు షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో రష్మికగా మార్చారు. ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. దీనిపై స్పందించిన కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు సూచనలు జారీ చేసింది.
View this post on Instagram