Chinmayi: అలాంటి వాళ్లకి అవకాశాలు ఇవ్వకండి.. అది లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్టే.. జానీ, కార్తీక్ లపై చిన్మయి సంచలన పోస్ట్

సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన గాత్రంతో కొన్ని (Chinmayi)లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆలాగే మహిళల సమస్యల గురించి కూడా ఆమె తన గొంతును వినిపిస్తూ ఉంటారు.

Chinmayi: అలాంటి వాళ్లకి అవకాశాలు ఇవ్వకండి.. అది లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్టే.. జానీ, కార్తీక్ లపై చిన్మయి సంచలన పోస్ట్

Singer Chinmayi posts sensational post on choreographer Johnny and singer Karthik

Updated On : November 2, 2025 / 8:49 PM IST

Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన గాత్రంతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆలాగే మహిళల సమస్యల గురించి కూడా ఆమె తన గొంతును వినిపిస్తూ ఉంటారు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ (Chinmayi)ఉంటారు. అలా ఇప్పటికే ఆమె చాలా సమస్యల గురించి మాట్లాడారు. చాలా సార్లు ట్రోల్ కూడా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి సంచలన కామెంట్స్ చేశారు చిన్మయి.

Janhvi Kapoor: గోల్డ్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాల విందు.. ఎంత క్యూట్ గా ఉందో..

కొంతకాలం క్రితం జానీ మాస్టర్ పై లైంగికి వేధింపుల వివాదం జరిగిన విషయం తెలిసిందే. అలాగే సింగర్ కార్తీక్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. దీంతో, కొంతకాలం పాటు ఇద్దరు ఇండస్ట్రీకి దూరం ఉండాల్సి వచ్చింది. ఇక జానీ మాస్టర్ అయితే ఏకంగా జైలుకి కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీ అవుతున్నారు. తాజాగా అదే విషయాన్ని టార్గెట్ చేసింది సింగర్ చిన్మయి. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

“సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లాంటి వాళ్లకు మళ్ళీ అవకాశాలు ఇవ్వడమంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్టే అవుతుంది. అధికారం, డబ్బును దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టడం సరికాదు. కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది ఎప్పటికీ వదిలిపెట్టదు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంలో కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.